దేవినేని ఉమాను పరామర్శించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari condolences to Devineni Uma
  • నిన్న కన్నుమూసిన దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్
  • చంద్రశేఖర్ తల్లి, భార్య, కుమార్తెలను పరామర్శించిన భువనేశ్వరి
  • భువనేశ్వరిని చూసి కంటతడి పెట్టుకున్న కుటుంబ సభ్యులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కృష్ణా జిల్లా కంచికచర్లకు తరలించారు. నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కంచికచర్లకు చేరుకున్నారు. చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవినేని ఉమాను పరామర్శించారు. భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Devineni Uma
Brother
Chandra Sekhar
Telugudesam

More Telugu News