వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తున్న చైనా మహిళ.. 3 సెకన్ల వీడియోలతో సంచలనం
- వస్తు ఉత్పత్తులకు 3 సెకన్ల వీడియోతో రివ్యూలు ఇస్తున్న చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జెంగ్ జియాంగ్
- లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వస్తువులకు రివ్యూలు.. ఆకర్షితులవుతున్న నెటిజన్లు
- వారానికి 14 మిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్న జెంగ్ జియాంగ్
జెంగ్ జియాంగ్.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రొడక్టులకు రివ్యూలు ఇస్తున్న సమయంలో ఆమె సహాయకులు వస్తువులతో కూడిన కంటెయినర్‌ను అందజేస్తారు. అందులోని అన్ని వస్తువులను తీసుకొని జెంగ్ జియాంగ్ రివ్యూ ఇస్తుంది. మిల్లీసెకన్ల వ్యవధిలోనే జెంగ్ జియాంగ్ ఉత్పత్తులను కెమెరాకు చూపించి రివ్యూ ఇస్తుంది. వస్తువు ధరతో పాటు కీలకమైన వివరాలను వెల్లడిస్తుంది. ఇదంతా మూడు సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. రాపిడ్-ఫైర్ విధానంలో జెంగ్ జియాంగ్ ఇస్తున్న రివ్యూలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో నమ్మశక్యం కాని రీతిలో వారానికి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.120 కోట్లు) సంపాదిస్తోంది. మరోవైపు ఆమె రివ్యూ ఇచ్చే ఉత్పత్తులకు మంచి అమ్మకాలు లభిస్తున్నాయట. కాగా టిక్‌టాక్ చైనా వెర్షన్ ‘డౌయిన్’లో జెంగ్ జియాంగ్‌కు ఏకంగా 5 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.