Advertisement

తెలంగాణలో బీజేపీకి షాక్... రాజీనామా చేస్తున్నట్లు బాబూ మోహన్ ప్రకటన

Babu Mohan announces resignation for BJP
  • కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోతున్నట్లు చెప్పిన బాబూ మోహన్
  • కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన బాబూమోహన్
  • కిషన్ రెడ్డి తన ఫోన్‌ను ఎత్తడం లేదని ఆరోపణ
  • భవిష్యత్తులో వరంగల్ లోక్ సభకు పోటీ చేస్తానని వెల్లడి
బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబూమోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

పార్టీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను వరంగల్ లోక్ సభకు పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీ అయినా బాగా పని చేసిన వారిని ఉండాలని కోరుకుంటుందని... కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పని చేసే వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనలాంటి వారు బీజేపీలో పని చేయడం కష్టమన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
Advertisement
babu mohan
Telangana
BJP

More Telugu News