Uttar Pradesh: పోర్న్ వీడియో చూసి చెల్లెలిపై అత్యాచారం, హత్య

After watching porn clip teen rapes and murders minor sister
  • ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో దారుణం
  • ఇంట్లో తల్లి లేని సమయంలో పోర్న్ వీడియో చూసిన యువకుడు
  • చివరకు మైనర్ చెల్లిపై అఘాయిత్యం, హత్య
  • బంధువు ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
పోర్న్ వీడియో చూసిన 19 ఏళ్ల ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. మైనర్ అయిన చెల్లెలిపై అత్యాచారానికి తెగబడి ఆపై హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని కస్‌గంజ్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 3న తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు సంజూ కుమార్ మొబైల్‌లో పోర్న్ కంటెంట్ చూశాడు. ఆ తరువాత చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం బయటకు చెబుతుందనే భయంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. 

బాలిక బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ‘‘ఘటన జరిగిన రోజు నిందితుడు సంజూ తల్లి ఆమె బంధువు ఇంటికి వెళ్లింది. సంజూ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు తన మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చెల్లెలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరకు ఆమెను హత్య చేశాడు’’ అని పోలీసులు తెలిపారు. సంజూ వాడిన మొబైల్ ఫోన్, అందులోని పోర్న్ వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని జైలుకు తరలించారు.
Uttar Pradesh
Crime News

More Telugu News