లోక్సభ ఎన్నికల బరిలోకి తెలంగాణ గవర్నర్ తమిళిసై?
- తూత్తుకుడి లేదంటే విరుదునగర్ నుంచి బరిలోకి?
- గతంలో పోటీచేసిన ప్రతిసారీ ఓటమి చవిచూసిన సౌందరరాజన్
- 2019 ఎన్నికల్లో కనిమొళి చేతిలో ఓటమి
2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్చార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా, తమిళిసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు.