హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్ బాధ్యతలు

Amrapali given additional charge as HGCL MD
  • ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు
  • ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బాధ్యతలు చూస్తున్న ఆమ్రపాలి
  • ఈ నెల 6 దానకిశోర్ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ కె. ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దానకిశోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు. 

కాగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దానకిశోర్ ఈ నెల 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. శనివారం హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ తీరికలేకుండా గడిపారు. వివిధ ప్రాజెక్టులు, అత్యవసరంగా పరిష్కరించాల్సిన దరఖాస్తులను అధికారులతో కలిసి సమీక్షించారు.
Advertisement
Amrapali
Hyderabad
Telangana
Revanth Reddy

More Telugu News