జగన్ పవర్ ఫుల్ డైలాగ్ తో యాత్ర-2 ట్రైలర్ రిలీజ్
- వైఎస్సార్ మరణం, తదనంతర పరిస్థితుల ఆధారంగా యాత్ర-2 చిత్రం
- ప్రధానపాత్రల్లో మమ్ముట్టి, జీవా... మహీ వి రాఘవ్ దర్శకత్వం
- ఫిబ్రవరి 8న రిలీజ్
వైఎస్సార్ మరణం, తదనంతర రాజకీయ పరిస్థితులు, జగన్ కాంగ్రెస్ ను వీడి నూతన పార్టీ ఏర్పాటు చేయడం, జైలు జీవితం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తదితర అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఓ అంధుడితో మాట్లాడుతూ... నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ పాత్రధారి జీవా పలికిన డైలాగ్ భావోద్వేగభరితంగా ఉంది. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.