కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య తర్వాత చివరి నిమిషంలో మనసు మార్చుకున్న ప్రియురాలు!

  • రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఘటన
  • అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు
  • మరో యువతితో ఏడాదిగా రిలేషన్‌షిప్
  • కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
  • ఆమెను అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబం ధర్నా
అతడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినప్పటికీ మరో యువతికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది.

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన. రాజుభట్ (34) కార్మికుడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని రవీనా (20)తో ఏడాదిగా అతడు రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో గురువారం ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 

కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఖేడ్ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న రైలు కిందికిదూకి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, చివరి నిమిషంలో భయపడిన రవీనా మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది. 

రాజు ఆత్మహత్యకు రవీనానే కారణమని, ఆమే అతడిని హత్య చేసిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆమెను అరెస్ట్ చేసేంత వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Crime News
Rajasthan
Lovers
Suicide
Relationship

More Telugu News