విశాఖపట్టణం జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య
- చినగదిలి రూరల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రమణయ్య
- కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దే దారుణం
- ఇనుప రాడ్డుతో తలపై మోది పరారైన దుండగులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, భూ సమస్యల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.