తెలుగులోనూ ఓ సినిమాలో నటించిన పూనమ్ పాండే
- గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసిన పూనమ్ పాండే
- పూనమ్ పాండే వయసు 32 ఏళ్లు
- గతంలో సామ్రాట్ సరసన తెలుగులో నటించిన పూనమ్ పాండే
కాగా, పూనమ్ పాండే గతంలో ఓ తెలుగు సినిమాలోనూ నటించారు. ఆ సినిమా పేరు 'మాలిని అండ్ కో'. ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ సామ్రాట్ హీరో. ఈ చిత్రం 2015లో వచ్చింది. ఆ తర్వాత పూనమ్ పాండే మళ్లీ తెలుగులో నటించలేదు. ఆమె 2013లో 'నషా' అనే బాలీవుడ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. బాలీవుడ్ లోనూ ఆమె నటించిన చిత్రాలు తక్కువే.