Anil Kumar Yadav: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

Nellore MLA met CM Jagan in Tadepalli
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల వైసీపీ ఐదో జాబితా ప్రకటించగా, నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా ఆ జాబితాలో పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అనిల్ కుమార్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. అనిల్ నరసరావుపేటకు బదిలీ అయిన నేపథ్యంలో, నెల్లూరు సిటీ వైసీపీ ఇన్చార్జి అంశంపై సీఎం జగన్ చర్చిస్తున్నట్టు తెలిసింది.

 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేసేది ఖాయం కాగా, అనిల్ కుమార్ స్థానంలో వైసీపీ తరఫున బరిలో దిగేది ఎవరన్నదానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 

కాగా, నేడు సీఎంవోకు వచ్చిన వారిలో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
Jagan
Narasaraopet
YSRCP
Nellore City

More Telugu News