హైదరాబాద్ వేదికగా ఝార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం... శామీర్పేట రిసార్టుకు తరలింపు
- హైదరాబాద్ చేరుకున్న 12 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు
- విమానాశ్రయం నుంచి రెండు బస్సుల్లో శామీర్పేట రిసార్టుకు తరలింపు
- ఈ నెల 5న కొత్త ముఖ్యమంత్రి బలనిరూపణ
ఈ నెల 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ కూటమి అప్రమత్తమైంది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటున్నారు. అసెంబ్లీ బలనిరూపణ వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉండనున్నారు.