కాంగ్రెస్ గెలవలేదు.. బీఆర్ఎస్ పార్టీనే ఓడిపోయింది: కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి
- యువతను మోసం చేస్తోందని మండిపాటు
- హామీలను వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందని విమర్శ
యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలను వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఉపయోగం లేదని చెప్పారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.