Nikhil Siddhartha: తండ్రి కాబోతున్న నటుడు నిఖిల్.. భార్య సీమంతం ఫొటో పోస్ట్

  • తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ‘ఎక్స్’లో ఫొటో పంచుకున్న నిఖిల్
  • అభిమానుల ఆశీస్సులు కావాలన్న నటుడు
  • ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమాతో బిజీ
  • కెరియర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ
Tollywood Actor Nikhil Expected First Baby Soon

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని కోరాడు. 

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాదు, అతడిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. నిఖిల్ కెరియర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది.

More Telugu News