ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సొరెన్!
- హేమంత్ సొరెన్ పై భూకుంభకోణం ఆరోపణలు
- మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ
- సీఎం పదవికి రాజీనామా!
ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రవాణా మంత్రి చంపై సొరెన్ ను జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లి నూతన సీఎంను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు.
చంపై సొరెన్... జేఎంఎం వ్యవస్థాపక అధినేత శిబు సొరెన్ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు.