అనకాపల్లి జిల్లాలో దారుణం.. బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం.. షాకింగ్ వీడియో ఇదిగో!
- జిల్లాలోని గవరపాలెంలో గతవారం ఘటన
- వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీ
- పరారీలో నిందితుడు
పని కోసం తరచూ వారింటికి వచ్చే కేబుల్ టెక్నీషియన్ గోవింద్ సోఫాలో 67 ఏళ్ల వృద్ధురాలు కూర్చుని ఉండడం చూశాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసును కొట్టేయాలని భావించాడు. ఈ క్రమంలో తువ్వాలుతో ఆమె గొంతు బిగించి హత్యకు యత్నించాడు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత వృద్ధురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.