బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తిన ప్రొఫెసర్ కోదండరాం
- తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదన్న కోదండరాం
- ప్రభుత్వం కూలిపోతుంది అనడం సరికాదని బీఆర్ఎస్ కు హితవు
- పైసలతో ఏమైనా చేయగలమనే అహంకారం బీఆర్ఎస్ లో ఉందని విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు... నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే ఎవరు కాదన్నారు... అంతేగానీ, త్వరలో ప్రభుత్వం కూలిపోతుంది, పడిపోతుంది అనడం సరికాదు అని ప్రొఫెసర్ కోదండరాం హితవు పలికారు. గత పాలకులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు. పైసలతో ఏమైనా చేయగలమనే అహంభావం బీఆర్ఎస్ లో ఉందని విమర్శించారు.