Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ డూప్ వివరాలు త్వరలో బయటపెడతా: సీఎం హిమంత బిశ్వ శర్మ

  • భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ డూప్ పాలుపంచుకున్నారన్న అస్సాం సీఎం
  • రాహుల్ గాంధీ డూప్ పేరు, అడ్రస్ త్వరలో వెల్లడిస్తానని ప్రకటన 
  • కొద్ది రోజులు ఓపిక పట్టాలని మీడియాతో వ్యాఖ్య
Will Share Details Of Rahul Gandhis Body Double Himanta Sarma

అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్‌ వివరాలను త్వరలో వెల్లడిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ముఖ్యమంత్రి గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ డూప్ పేరు, అడ్రస్ వంటి వివరాలను త్వరలో బయటపెడతానని సీఎం తెలిపారు. 

‘‘ఇదంతా ఊరికే చెప్పట్లేదు. ఆ డూప్ ఎవరు, అతడి అడ్రస్ ఏంటి..ఇవన్నీ బయటపెడతా. కొన్ని రోజులు ఆగండి. రేపు (ఆదివారం) దిబ్రూగఢ్‌కు వెళతా. సోమవారం గువాహటిలో పర్యటిస్తా. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాహుల్ డూప్ పేరు, అడ్రస్ అన్నీ చెబుతా’’ అంటూ సోనిత్‌పోర్‌లో ఓ కార్యక్రమంలో సీఎం హిమంతశర్మ అన్నారు. 

మనిపూర్ నుంచీ మహారాష్ట్ర వరకూ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జనవరి 18 నుంచి 25 మధ్య అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి హిమంత అని మండిపడ్డారు. యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఇక గువాహటిలో యాత్ర సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. రాహుల్ గాంధీతో పాటూ మరికొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని కూడా సీఎం అప్పట్లో వ్యాఖ్యానించారు. 

More Telugu News