విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం.. మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం రేవంత్!
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కోదండరాం భేషరతు మద్దతు
- ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి
- బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ!
కేబినెట్లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భేషరతు మద్దతు ప్రకటించిన కోదందరాంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీచేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.