యూట్యూబ్‌లో లైక్స్ కోసం లైవ్‌లో జంతువులను చంపుతున్న యువతి
- అమెరికాలోని పెన్సిల్వేనియాలో షాకింగ్ ఘటన
- అనిగర్ మోన్సీ అనే 28 ఏళ్ల యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు
- లైక్స్ కోసం లైవ్‌లో జంతు హింస.. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోస్తున్న వైనం
జంతువుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనాగరికమని, అమానవీయమని అప్పర్ డార్బీ పోలీస్ సూపరింటెండెంట్ అధికారి తిమోతీ బెర్న్‌హార్డ్ హెచ్చరించారు. జంతువులను చంపడమే కాకుండా ఇలా చేయాలంటూ దాదాపు 20 వేల మంది సబ్‌స్క్రైబర్లను ప్రోత్సహించడం వాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కాగా అరెస్టుకు ముందు గత శుక్రవారం ఆమె చివరి వీడియోను పోస్ట్ చేసింది. ‘కుకింగ్ లక్కీ’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మోన్సీ వంట గదిలో ఒక కోడిని హింసించి చంపింది. కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వంటగది సింక్‌పై కోడి మెడను కత్తితో కోసింది. ఇక వీడియో చేసే సమయంలో ఆమె లైక్స్ కొట్టాలని కోరుతోంది. లైవ్ చూసే వారి సంఖ్య పెరిగిన తర్వాత జంతువులను చంపుతుండేదని వీడియోల ద్వారా స్పష్టమైంది. అనేక కప్పలు, పక్షులను చంపింది. ఒక వీడియోలో మొండి కత్తితో కుందేలుని చంపిందనే ఆరోపణలున్నాయి.