కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్‌రావు కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేంద్రరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్వాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978-83లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. ఆయన మరణవార్త విని పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. 

కంటోన్మెంట్ ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ శ్మశాన వాటికలో నేడు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Bingi Mashchendar Rao
Secunderabad
Contonment
Janata Party

More Telugu News