Allu Arjun: మేమంతా ఎంతో గర్వపడేలా చేశారు: అల్లు అర్జున్

Allu Arjun wishes to Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవికి మరో అదుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. 1978లో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 

మరోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... 'ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ అచీవ్ మెంట్ ను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్నందరినీ ఎంతో గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు చిరంజీవి సాధించిన ఘనతలను పేర్కొంటూ, ఆయన ఫొటోను షేర్ చేశారు. 
Go Back to Shorts
Allu Arjun
Chiranjeevi
Tollywood
Padma Vibhushan

More Telugu News