బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై పిటిషన్.. విచారణకు స్వీకరించిన హైకోర్టు
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో బీఆర్ఎస్కు భూకేటాయింపు
- అత్యంత ఖరీదైన భూమిని తక్కువ ధరకే కేటాయించారని హైకోర్టులో పిటిషన్ దాఖలు
- ఈ పిటిషన్ను ఈ రోజు విచారణకు స్వీకరించిన హైకోర్టు
ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.41 కోట్లకే కేటాయించారని.. ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని... దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా చేర్చారు. గత ఏడాది జులైలో దాఖలైన ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది.