ఇక్కడ కూడా ఇద్దరు హీరోల మధ్య పోటీ తప్పలేదే!
- ఈ నెల 12న విడుదలైన 'కెప్టెన్ మిల్లర్'
- అదే రోజున థియేటర్లకు వచ్చిన 'అయలాన్'
- ఎక్కువ మార్కులు కొట్టేసిన శివకార్తికేయన్
- తెలుగులో రేపు విడుదలవుతున్న సినిమాలివే
ధనుశ్ హీరోగా చేసిన 'కెప్టెన్ మిల్లర్' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. సెంథిల్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఇక ఇదే రోజున శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన 'అయలాన్' సినిమా కూడా థియేటర్స్ కి వచ్చింది. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కథానాయికగా మెరిసింది. ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ పరంగా పూర్తి వైవిధ్యభరితమైనవే. ధనుశ్ కి క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన సినిమాకంటే 'అయలాన్' ఎక్కువ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే 'అయలాన్' లో గ్రహాంతరవాసి రూపకల్పనపై విమర్శలను కూడా ఈ సినిమా ఎదుర్కొంటూనే ఉంది. అలాంటి ఈ రెండు సినిమాలు తెలుగులోనూ ఒకే రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుని ఇక్కడ కూడా పోటీకి దిగుతుండటం విశేషం. రేపు ఈ రెండు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి.