ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా పోరాటం చేస్తాం: హరీశ్ రావు
- ప్రచారంలో అబద్ధం... పాలనలో అసహనం... ఇదే కాంగ్రెస్ తీరు అని విమర్శ
- కష్టపడే వారికి మన పార్టీలో గుర్తింపు ఉంటుందని హామీ
- కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని వ్యాఖ్య
నల్గొండ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు మంచి సూచనలు చేసినట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ క్రమశిక్షణతో పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.