పవిత్ర లోకేశ్ తో తన జీవితం ఎలా ఉందో తెలిపిన నరేశ్
- ఐదేళ్లుగా కలిసి జీవిస్తున్న పవిత్ర, నరేశ్
- తనకు జరిగిన మూడు పెళ్లిళ్లతో తనకు సంతోషం లేదన్న నరేశ్
- పవిత్రతో జీవితం సంతోషంగా ఉందని వ్యాఖ్య
మరోవైపు, ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ, పవిత్రతో తన జీవితం ఎలా ఉందో చెప్పారు. ప్రపంచంలో సగం మంది భార్యాభర్తలు విడిపోతున్నారని చెప్పారు. పెళ్లి వల్ల సమస్యలు ఎదుర్కొని 70 నుంచి 80 శాతం మంది మనశ్శాంతిగా లేరని అన్నారు. తనకు జరిగిన మూడు పెళ్లిళ్లతో తనకు సంతోషం కలగలేదని చెప్పారు. అందుకే పవిత్ర విషయంలో తాను ఒక నిర్ణయం తీసుకున్నానని... అది వివాదాస్పదమయిందని అన్నారు. పవిత్రతో తన జీవితం చాలా సంతోషంగా ఉందని నరేశ్ చెప్పారు. మిగిలిన జీవితాన్ని తాను, పవిత్ర ప్రశాంతంగా ముగించాలని అనుకుంటున్నామని తెలిపారు.