షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల నియామకం
- నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన షర్మిల
- విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కార్యక్రమం
- ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కే
- సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను షర్మిలతో పాటే రాజకీయ ప్రయాణం సాగిస్తానని, ఆమె ఏ పార్టీలోకి వెళితే తాను కూడా ఆ పార్టీలోకి వెళతానని కొన్నిరోజుల కిందటే ప్రకటించారు.