ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి
- ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించనున్న షర్మిల
- రాత్రికి ఇడుపులపాయలోనే బస
- రేపు విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించనున్న షర్మిల
ఈ రాత్రికి వీరు ఇడుపులపాయలోనే బస చేస్తారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకుని, ఏపీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. మరోవైపు షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.