చాలా ఏళ్లుగా అతని ప్రేమలో ఉన్నా: తాప్సీ

Taapsee revealed her love with Mathias
  • డెన్కార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ ప్రేమలో తాప్సీ
  • మాథిస్ తో పదేళ్లుగా ప్రేమలో ఉన్నానని వెల్లడి 
  • అతని వల్ల ఎంతో సంతోషంగా ఉన్నానన్న తాప్సీ
తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న హీరోయిన్లలో తాప్సీ ఒకరు. టాలీవుడ్ లో 'ఝుమ్మంది నాదం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్పీ... తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ... బాలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. 

మరోవైపు తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో ఉందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించింది.  

మాథిస్ బోతో తాను దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని తాప్సీ తెలిపింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో పరిచయం ఏర్పడిందని... ఇన్నేళ్లుగా తమ బంధం బలపడుతూ వచ్చిందని చెప్పింది. అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని... అందుకే తమ ప్రేమ గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడా మాట్లాడలేదని చెప్పింది. మాథిస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.
.
Go Back to Shorts
Taapsee
Bollywood
Tollywood
love

More Telugu News