రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అసోంలో కేసు
- షెడ్యూల్‌లో లేని రూట్‌లోకి యాత్రను మళ్లించి ట్రాఫిక్ అవాంతరాలు సృష్టించారని కేసు నమోదు
- ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్‌ఐఆర్
- యాత్రకు ఆటంకాలు కలిగించాలనే ఉద్దేశంతోనే కేసు పెట్టారన్న కాంగ్రెస్
కాగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్‌కు చెందిన అసోం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా అన్నారు. ట్రాఫిక్ మళ్లింపు దగ్గర పోలీసులెవరూ లేరన్నారు. యాత్ర కోసం తమకు కేటాయించిన మార్గం చాలా ఇరుకుగా ఉందన్నారు. జనాలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో కొన్ని మీటర్ల పాటు పక్కనున్న దారి గుండా ప్రయాణించామని అన్నారు. సీఎం హిమంత బిశ్వా శర్మ యాత్ర విజయవంతమవుతోందని భయపడుతున్నారని దేబబ్రత సైకియా అన్నారు. అందుకే యాత్రకు ఆటంకం కలిగించాలనుకుంటున్నారని విమర్శించారు. కాగా అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ మేర జనవరి 25 వరకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కొనసాగనుంది.