అయోధ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి విరాట్ కోహ్లీ.. పర్మిషన్ ఇచ్చిన బీసీసీఐ!
- కోహ్లీ అభ్యర్థన మేరకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని పేర్కొన్న ‘క్రిక్‌బజ్’ రిపోర్ట్
- 21న ప్రాక్టీస్ సెషన్ నుంచి బయలుదేరి అయోధ్య వెళ్లనున్న కింగ్
- సచిన్, ధోనీలతో పాటు అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన స్టార్ బ్యాటర్
కాగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు (బుధవారం) జరగనున్న చివరి మ్యాచ్‌తో ముగిసిపోనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకి, సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. అనంతరం ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు సన్నాహకాలు మొదలుకానున్నాయి. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకొని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తుండడంతో కోహ్లీ ఒక రోజు ప్రాక్టీస్ సెషన్‌కు దూరం కానున్నాడు. మరోవైపు తొలి టెస్టు ఆరంభానికి మూడు రోజుల ముందు ఇంగ్లండ్ టీమ్ భారత్‌కు చేరుకోనుంది.