హత్యా రాజకీయాలను జూపల్లి నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ అన్నారు: గువ్వల బాలరాజు వివరణ
- కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న గువ్వల
- జూపల్లిపై కేటీఆర్ ఆరోపణలు చేయలేదని వివరణ
- ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకు రావడం సరికాదని హితవు
జూపల్లి నిన్న మాట్లాడుతూ ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ ఇష్టారీతిన ఆరోపణలు చేశారని విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ హయాంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జూపల్లి ఇప్పుడు లేనిపోని అంశాలను తెరపైకి తీసకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనుకేసుకు రావడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి వారి కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపించారు.