కాంగ్రెస్ పట్ల మీ ప్రేమను హర్షిస్తున్నాను.... కానీ...!: బండి సంజయ్‌కి అద్దంకి దయాకర్ కౌంటర్

15-01-2024 Mon 14:38 | Telangana
Advertisement
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరిక
  • బండి సంజయ్ మాటల్లో బీఆర్ఎస్‌తో వారి అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం కనిపిస్తోందని వ్యాఖ్య
  • మా పార్టీ వారు బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఉంటే మా వద్ద అంతకుమించి ప్రణాళికలు ఉన్నాయన్న అద్దంకి
Advertisement
కాంగ్రెస్ పట్ల మీకు ఉన్న ప్రేమను హర్షిస్తున్నప్పటికీ... మీ మాటల్లో బీఆర్ఎస్‌తో మీ అనైతిక రాజకీయం కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చురక అంటించారు. సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఏ పార్టీ అయినా ప్రజలు వారిని నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా... ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం తీసుకు రావాలని భావించినా ప్రజలు సహించరన్నారు. మిత్రుడు బండి సంజయ్ తమపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే తమను ఏదో అలర్ట్ చేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ... అటువైపు నుంచి బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి కనిపిస్తోందన్నారు.

బండి సంజయ్ ప్రకటన చూసినవారికి... కాంగ్రెస్, బీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలు చేస్తోన్నట్లుగా... అలాగే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ వారే బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఉంటే మా పార్టీ వద్ద అంతకుమించి ప్రణాళికలు ఉన్నాయన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని... కాబట్టి వారే కాపాడుకుంటారన్నారు.
Advertisement
addanki dayakarTelanganaBandi SanjayCongressBJP

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more