‘లెగ్ బై’ పరుగుతో భారత్ గెలుపు.. టీమిండియా డగౌట్‌లో నవ్వులే నవ్వులు.. వీడియో ఇదిగో!
- క్రీజులో దూబే ఉండడంతో సిక్సర్ లేదా ఫోర్ కొట్టి గెలిపిస్తాడనుకుంటే లెగ్ బై రన్ రావడంతో విరబూసిన నవ్వుల పువ్వులు
- నవ్వు ఆపుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు
- వీడియో షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్
ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫారూఖీ వేసిన బంతి దూబే ప్యాడ్స్‌కు తగిలి పక్కకు వెళ్లింది. దీంతో క్రీజులో ఉన్న దూబే, రింకూ సింగ్ లు లెగ్ బై రన్ తీయడంతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో డగౌట్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు నవ్వులు చిందించారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, అర్షదీప్ సింగ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ పడిపడి నవ్వారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మైదానంలోని ఫ్యాన్స్ ముఖాల్లో చిన్నపాటి నవ్వు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా బుధవారం చివరిదైన 3వ టీ20 మ్యాచ్ జరగనుంది.