కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి గోయల్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
- పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులపై చర్చించిన సీఎం
- రూ.4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగా ఈ భేటీ జరిగింది.