మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ... : మాజీ మంత్రి హరీశ్ రావు
- ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని హితవు
- ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సూచన
- ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని వ్యాఖ్య
ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.15వేలు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పొట్ట కొట్టారంటూ ఆటో డ్రైవర్లు ధర్నాలు... నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. పండుగ సమయంలో ఆటోవాలాల జీవితంలో సంబరం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని భావించారని... కానీ రోడ్డున పడ్డారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమేనని... కానీ బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం పెంచాలన్నారు.