'వ్యూహం' సినిమాకు మరో ఎదురుదెబ్బ.. ఓటీటీలోనూ విడుదల చేయొద్దన్న కోర్టు!

  • వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన నారా లోకేశ్
  • వ్యూహం సినిమాపై తీర్పును 22కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
  • ఆన్‌లైన్, ఓటీటీ, ఇంటర్నెట్‌ వేదికల్లోనూ విడుదల చేయొద్దన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు
వ్యూహం సినిమా విషయంలో నిర్మాతకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఎఫ్‌సీ జారీచేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఈ ఉత్తర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. విచారణ ముగియడంతో నిన్నటికి తీర్పును వాయిదా వేసిన కోర్టు.. నిన్న మరోమారు వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయవద్దని నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

Vyuham Movie
Ram Gopal Varma
TS High Court
Hyderabad City Civil Court
Andhra Pradesh
Telugudesam

More Telugu News