కోదండరాం తప్పుడు ప్రచారం చేశారు... మేం ఉద్యోగాలిస్తేనే కదా, మీరు వాళ్లకి జీతాలిచ్చారు!: పాడి కౌశిక్ రెడ్డి
- జేఏసీ పేరుతో కోదండరాం తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
- రేవంత్ ప్రభుత్వం జనవరి 4న జీతాలు ఇచ్చింది తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన వారికేనని వ్యాఖ్య
- పదేళ్ల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న పాడి కౌశిక్ రెడ్డి
నిజం గడపదాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న విధంగా కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. డిసెంబర్ 2024 వరకు రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని... కానీ తమ హయాంలో వచ్చిన 2 లక్షల ముప్పై వేలకు పైగా ఉద్యోగాలకు తోడు మీరూ మరో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సమైక్య ఏపీలో పదేళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 24వేలు అని, అందులోనూ తెలంగాణకు ఇచ్చింది పదివేలు మాత్రమే అన్నారు. కానీ బీఆర్ఎస్ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఇది కేసీఆర్ గొప్పతనమని గుర్తించాలన్నారు. అలాగే, పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పది లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేదని తెలిపారు.