అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024.. పలు బ్రాండ్లపై డిస్కౌంట్లు.. మోటరోలా రేజర్ 40 అల్ట్రాపై రూ. 50 వేల రాయితీ!
- శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీపై రూ. 35 వేల డిస్కౌంట్
- ఆఫర్ల హోరెత్తిస్తున్న అమెజాన్
- 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్
- ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే
- ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు
- ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, తక్షణ రాయితీలు అదనం
సేల్లో భాగంగా కొన్ని ఉత్పత్తులపై రూ.1,499తో నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పలు స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది.
ఈ రాయితీలపై ఓ లుక్కేసుకోండి
| ఉత్పత్తి | అసలు ధర (రూపాయిల్లో) | రాయితీ |
| మోటరోలా రేజర్ 40 అల్ట్రా | 1,19,999 | 69,999 |
| శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ | 89,999 | 54,999 |
| ఐఫోన్ 13 | 59,900 | 48,999 |
| వన్ప్లస్ 11ఆర్ 5జీ | 39,999 | 38,999 |
| ఆనర్ 90 5జీ | 47,999 | 25,999 |
| వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ | 19,999 | 17,999 |
| రెడ్మీ నోట్ 13 5జీ | 17,999 | 16,999 |
| రెడ్మీ 12 5జీ | 12,999 | 11,999 |
| రియల్మీ నార్జో 6060x 5జీ | 12,999 | 11,499 |
| ఐటెల్ ఏ70 | 9,999 | 6,119 |
| టెక్నోపాప్ | 7,999 | 5,849 |