అమెరికా మిలటరీ బేస్‌పై ఎగిరే పళ్లెం.. వైరల్ వీడియో ఇదిగో!

UFO spotted over US military base went viral video
  • వీడియోను షేర్ చేసిన ఫిల్మ్‌మేకర్ జెరేమీ కార్బెల్
  • జెల్లీఫిష్ ఆకారంలో మిలటరీ బేస్‌పై ఎగురుతూ కనిపించిన యూఎఫ్‌వో
  • 2018లో అమెరికా సైనికులు రికార్డు చేశారన్న కార్బెల్
  • ఓ సరస్సులో మునిగి 17 నిమిషాల తర్వాత తిరిగి ఆకాశంలోకి
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ప్రపంచవ్యాప్తంగా అటు శాస్త్రవేత్తలకు, ఇటు సామాన్యులకు అత్యంత ఆసక్తి కలిగించేది ఏదైనా ఉందంటే అది ఫ్లయింగ్ సాసర్ (ఎగిరే పళ్లెం) మాత్రమే. అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌‌వో)గా వ్యవహరించే ఇవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో, అమెరికా మిలటరీ బేస్‌పై మరోసారి ఇది కనిపించి కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. జెల్ఫీఫిష్ ఆకారంలో ఎగురుతున్నట్టుగా ఉన్న ఈ వీడియోను తొలుత ఆర్టిస్ట్, ఫిల్మ్‌మేకర్ జెరెమీ కార్బెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వెంటనే అది ఎక్స్ (గతంలో ట్విట్టర్)కి ఎక్కి ఎల్లలు దాటిపోయింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉందీ వీడియో క్లిప్. ఇరాక్‌లోని జాయింట్ అమెరికా బేస్‌పై తిరుగుతున్న ఎగిరేపళ్లెం నెటిజన్లలో ఉత్సుకత పెంచింది. 

వారంలోనే మరో వీడియో
ఈ వీడియోను షేర్ చేసిన కార్బెల్ దీనిని చొరబాటుగా అభివర్ణించారు. నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది 2018లో జరిగిందని, అక్కడి సైనిక సిబ్బంది దీనిని రికార్డు చేశారని చెబుతున్నారు. మియామీలో ఓ మాల్ వెలుపల 10 అడుగుల గ్రహాంతరవాసి కనిపించినట్టు వైరల్ అయిన వీడియోపై పోలీసులు స్పందించిన వారంలోనే ఇప్పుడీ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. 

తాజా వీడియో విషయానికి వస్తే ఆ యూఎఫ్‌వో ఓ సరస్సులో మునిగి 17 నిమిషాల తర్వాత 45 డిగ్రీల కోణంతో తిరిగి పైకి లేచి వేగంగా ఆకాశంవైపు దూసుకెళ్లనట్టు కార్బెల్ పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు అది ఫ్లైయింగ్ సాసరేనన్న వాదనతో ఏకీభవిస్తే, మరికొందరు మాత్రం అదంతా ఒట్టిదేనని కొట్టిపడేస్తున్నారు. అది కెమెరా లెన్స్‌పై పడిన మరక తప్ప మరోటి కాదని, తమను ఫూల్స్‌ను చేయొద్దని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
UFO
Flying saucer
US
US Military Base
Jeremy Corbell

More Telugu News