'మై డియర్ దొంగ' .. 'ఆహా'కి రొమాంటిక్ కంటెంట్!
- రొమాంటిక్ కామెడీగా 'మై డియర్ దొంగ'
- అభినవ్ గోమఠం జంటగా శాలిని కొండేపూడి
- దర్శకుడిగా వ్యవహరించిన సర్వజ్ఞ కుమార్
- పోస్టర్స్ తోనే ఆసక్తిని రేపుతున్న 'ఆహా'
అడవిదొంగ గురించి విన్నారు .. టక్కరి దొంగ గురించి విన్నారు .. జేబుదొంగ గురించి విన్నారు .. 'మై డియర్ దొంగ' గురించి తెలుసుకోవాలంటే 'ఆహా'లోకి అడుగుపెట్టనున్న ఈ కంటెంట్ ను చూడవలసిందే అంటూ పోస్టర్స్ వదులుతున్నారు. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మహేశ్వర రెడ్డి నిర్మించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించిన ఈ సినిమా, ఈ నెలలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ .. రొమాంటిక్ టచ్ తో కూడిన కథ ఇది. హాస్యాన్ని పండించడంలో అభినవ్ గోమఠం మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందనేది చూడాలి.