'నా సామిరంగ' నుంచి ట్రైలర్ రిలీజ్!

Na Samiranga Trailer Released
  • నాగార్జున నుంచి 'నా సామిరంగ'
  • ఆయన జోడీగా ఆషిక రంగనాథ్ అందాల సందడి 
  • సంగీతాన్ని అందించిన కీరవాణి 
  • ఈ నెల 14వ తేదీన సినిమా రిలీజ్ 

నాగార్జున మొదటి నుంచి కూడా చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వచ్చారు. తన తాజా చిత్రమైన 'నా సామిరంగ'తో కూడా ఆయన విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే బలమైన సంకల్పంతో నాగార్జున ముందుకు వెళ్లారు. అలా ఈ నెల 5వ తేదీనే ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. 

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే ప్రమోషన్స్ ను సాగిస్తున్నారు. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాదాపు ప్రధానమైన పాత్రలన్నీ కవర్ చేశారు. 

గ్రామీణ నేపథ్యంలోని రాజకీయాలు .. అల్లర్లు .. జాతర సమయంలో జరిగే గొడవలు .. సరసాలు .. ఇలా అన్ని అంశాలతో నడిచే కథ ఇది. వీటన్నింటినీ ట్రైలర్ లో కవర్ చేశారు. గతంలో తమ కాంబినేషన్లో .. గ్రామీణ వాతావరణంలో వచ్చిన 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' మాదిరిగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని కీరవాణి చెప్పడం విశేషం. నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ మెరవనుండగా, అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Go Back to Shorts
Na Samiranga
Nagarjuna
Ashika Ranganath

More Telugu News