ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ టూర్
- మూడు రోజులు పర్యటించనున్న సీఈసీ బృందం
- ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై అధికారులతో సమీక్ష
- మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ
- ఈ నెల 10న తిరుగు ప్రయాణం
అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 10న సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అవుతారని అధికారులు తెలిపారు. అదేరోజు సాయంత్రం ఎన్నికల కమిషనర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడతారని చెప్పారు. సమావేశం పూర్తయ్యాక సీఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుందని పేర్కొన్నారు.