సేవకులం తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకున్నాం.. నెల రోజుల పాలనపై రేవంత్‌రెడ్డి
- ఈ నెల రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌రెడ్డి
- అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న సీఎం
- నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్న రేవంత్
పేదల గొంతు వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ, రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు సాగుతోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు.