YV Subba Reddy: తెలంగాణ పరిస్థితులను బట్టే షర్మిల కాంగ్రెస్ లో చేరారు: వైవీ సుబ్బారెడ్డి

  • కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం
  • కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల
  • వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారన్న వైవీ
  • ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజలు జగన్ వైపేనని ధీమా
YV Subbareddy reacts to Sharmila joining in Congress

వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల తాజా నిర్ణయం వల్ల ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. 

వైసీపీలో అవకాశం లేకపోవడం వల్లే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని, తెలంగాణలో పరిస్థితులను బట్టే కాంగ్రెస్ లో విలీనం నిర్ణయం తీసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. షర్మిలే కాదు... ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కూటమి కట్టినా ప్రజల మద్దతు జగన్ కే ఉందని స్పష్టం చేశారు. జగన్ కాకుండా మరొకరు సీఎం అయితే రాష్ట్రంలోని పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. 

ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల... పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని... ఆంధ్రప్రదేశ్ కు పంపినా, అండమాన్ కు పంపినా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News