మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం... పేల్చేస్తామంటున్నారు: మంత్రి సీతక్క ఆగ్రహం
- తాము ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న మంత్రి సీతక్క
- తమది గడీల పాలన కాదు... గల్లీ బిడ్డల పాలన అన్న మంత్రి
- బీఆర్ఎస్ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపణ
బీఆర్ఎస్ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపించారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అని హామీ ఇచ్చారని... కానీ ఏం చేశారో అందరికీ తెలుసునన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ 420 అనే ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.