షర్మిల కాంగ్రెస్‌లో చేరితే 40 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు వెళ్తారు: రఘురామకృష్ణరాజు
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 లోపు సీట్లే వస్తాయన్న వైసీపీ రెబల్ ఎంపీ
- కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల నిర్ణయించడం వైసీపీకి పెద్ద ప్రమాదమని వ్యాఖ్య
- క్రిస్టియన్, ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్తాయని విశ్లేషించిన రఘురామ
కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల నిర్ణయం తీసుకోవడం వైసీపీకి ఒక పెద్ద ప్రమాదం లాంటి పరిణామమని వ్యాఖ్యానించారు. వైకాపాలో టికెట్ దక్కని నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీచేస్తారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న తర్వాత వైసీపీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. ‘‘ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీకి 30-35 స్థానాలు వస్తాయని గతంలో నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 20 లోపే ఉంటుంది’’ అని రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైకాపాకు ఇప్పటివరకు దన్నుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్‌వైపు మళ్లనున్నాయి. సీఎం జగన్‌ను భరించే నాయకులు, ప్రజలు రాష్ట్రంలో ఎవరూ లేదని విమర్శించారు. అన్ని వర్గాల ఆగ్రహావేశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాయని అభిప్రాయపడ్డారు.