రేపటి నుంచి భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం

  • చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ 'నిజం గెలవాలి' కార్యక్రమం
  • మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
  • రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో తీవ్ర మనస్తాపానికి గురై, చనిపోయిన వారి కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా ఆమె పరామర్శిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. 3వ తేదీన విజయనగరం జిల్లా, 4న శ్రీకాకుళం జిల్లా, 5న విశాఖపట్నం జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు.


Nara Bhuvaneswari
Chandrababu
Telugudesam
Nijam Gelavali

More Telugu News