Rajiv Gandhi International Airport: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన శంషాబాద్ విమానాశ్రయం!

  • సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం 
  • కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌లు పొందే సౌలభ్యం
  • కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ఎయిర్‌పోర్టు అధికారులు
self check in counter facility near parking spaces in Shamshabad airport

నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్తి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు..విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందొచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. 

ఈ విధానంలో ప్రయాణికులు కారు పార్కింగ్ వద్దే స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. అక్కడి కియోస్క్‌లలో తమ ప్రయాణ వివరాలు చెక్ చేసుకుని చెక్-ఇన్ కావచ్చు. ఆ తరువాత క్షణాల వ్యవధిలోనే మొబైల్‌కు బోర్డింగ్ పాస్‌లు వస్తాయి. బ్యాగేజీ ట్యాగర్లూ వచ్చేస్తాయి. అనంతరం, ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ వద్దకు వెళ్లి కన్వేయర్ బెల్ట్‌పై సామగ్రి పెడితే అది ప్రాసెస్ అవుతుంది. బ్యాగులకు ట్యాగులు ప్రయాణికులే వేయాల్సి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులకు అధికారులు రసీదు జారీ చేశాక సంబంధిత ఎయిర్ లైన్స్‌కు ధ్రువీకరణ సందేశం వెళుతుంది.

More Telugu News