వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న రకుల్ ప్రీత్... పెళ్లికొడుకు ఇతనే!

  • బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్
  • తమ ప్రేమ వ్యవహారాన్ని 2021లో బయటపెట్టిన రకుల్, జాకీ
  • ఫిబ్రవరిలో గోవాలో పెళ్లి
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే దాంపత్య జీవితంలోకి ప్రవేశించనుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో చాలాకాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్... ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనుంది. రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీల పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరగనుంది. 

ఓ ప్రైవేటు కార్యక్రమంలా జరగనున్న ఈ పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. 

రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ తాము ప్రేమలో ఉన్నట్టు 2021లో అధికారికంగా వెల్లడించారు. ఆ తర్వాత ఇరువురు తామిద్దరం కలిసున్న ఫొటోలను పంచుకోవడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందించడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం కూడా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ విహారయాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది.

Rakul Preet Singh
Jackky Bhagnani
Marriage

More Telugu News